//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళలకు అండగా హెల్ప్‌లైన్ 181

Category : national

మహిళలకు అండగా ఉండేందుకు అందుబాటులోకి రాబోతోంది ఉమెన్ హెల్ప్‌లైన్. ఒకే ఒక్క ఫోన్‌కాల్  వారిలో ధైర్యాన్ని నింపనుంది. వారు చేయాల్సిందల్లా తమ సమస్యను చెప్పుకోవడమే. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మహిళలు 181 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 15 నుంచి ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి రాబోతోంది.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకోవడానికి,  ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు నేనున్నానంటూ ఉమెన్ హెల్ప్‌లైన్ అందుబాటులోకి రాబోతోంది. పోకిరీలు, అత్తమామలు, బంధువులు, ఇతర నేరస్థుల బారి నుంచి మహిళలను కాపాడేందుకు ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడనుంది.

జాతీయస్థాయిలో మహిళల కోసం 181 హెల్ప్‌లైన్ నెంబర్‌ను కేటాయించారు. హైదరాబాద్‌లో జీవీకే సంస్థ భాగస్వామ్యంతో ఈ హెల్ప్‌లైన్‌ను అమలుచేయనున్నారు. సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వశాఖలు, పోలీసులు, న్యాయశాఖ, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమశాఖలు జోక్యం చేసుకుని మహిళలకు అండగా నిలవనున్నాయి.

 ఇందుకోసం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ తగు ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే బాలల కోసం దేశవ్యాప్తంగా చైల్డ్‌లైన్ 1098 హెల్ప్‌లైన్‌ను అమలుచేస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా వందల మంది బాలలను రక్షించారు. అయితే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపుల బారి నుంచి తప్పించేందుకు తాజాగా ఉమెన్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తేనున్నారు.