//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ రివ్యూ

Category : movies

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా త్రినాథ‌రావు న‌క్కిన దర్శకత్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హ‌లో గురూ ప్రేమ కోస‌మే". శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరస ప్లాప్ లతో సతమవుతున్న దిల్ రాజు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 13వ తేదిన విశాఖ‌ప‌ట్నంలో ప్రీ రిలీజ్ వేడుక‌ను జరుపుతున్నారు. లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. దర్శకుడు గతంలో తెరకెక్కించిన సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి సినిమాలు బిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన చుట్టు జరిగే, మనం అనుకునే మాటలలో ఈ చిత్రంలో పెట్టాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే "ఇంత పొద్దున్నే సంజుగాడు ఎక్కడికి వేళ్ళాడే, వాడివడినో కొట్టాలని తెల్లారిగట్టే లేచి వెళ్ళాడు" అనే డైలాగ్ చూస్తుంటే ఇది ఒక కాలేజ్ నేపధ్యలో సాగె చిత్రం లా కనిపిస్తుంది. అదేవిధంగా రామ్ చెప్పే డైలాగ్ "స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, జాయిన్ అయ్యున ఫస్ట్ డే చేసే పని ఏమిటో తెలుసా..అమ్మాయిలలో ఎవరు బాగున్నారని అబ్బాయలు, అబ్బాయాలలో ఎవరు బాగున్నారా అని అమ్మాయలు ఏరుకోవడం". ఈ డైలాగ్ తో ఈ చిత్రం లవ్ ఇంటెర్ట్రైనెర్ తెరకెక్కుతుందని అర్ధమవుతుంది.

ఈ సినిమాలో రామ్, ప్రకాష్ రాజ్ లా మధ్య వచ్చే సీన్ లు కూడా చాల బాగున్నాయి.
అయితే ఈ సినిమాలో రామ్, ప్రకాష్ రాజ్ పాడిన " ఫ్రెండు..ఫ్రెండు" సాంగ్ ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. "ఏమిచేస్తున్నావ్" అని ప్రకాష్ రాజ్ అనడం, దీనికి రామ్ సైట్ కొడుతున్న ఫ్రెండ్ అని రిప్లయ్ ఇవ్వడం చూస్తుంటే ఈ సినిమా కొత్తగా ఉన్నట్లు తెలుస్తుంది. దసరా కానుకగా ఈ నెల 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.