//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ ని ఆపగలరా...

Category : movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాజాగా విడుదలైన అరవింద సమేత చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతుంది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 125 కోట్లు కలెక్షన్స్ దాటిపోయింది. అయితే ఎన్టీఆర్ సవాళ్లు విసురుతున్నారు ఇద్దరు హీరోలు. వారిలో ఒకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ అయితే మరొకరు విలక్షణ నటుడు విశాల్.

రామ్ "హలో గురూ ప్రేమకోసమే", విశాల్ "పందెం కోడి 2 " చిత్రాలు అక్టోబర్ 18 న దసరా రోజు విడుదల కానున్నాయి. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై చాల అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా విశాల్ నటించిన పందెం కోడి పదమూడేళ్ళ క్రితం విడుదలై తెలుగు ,తమిళ బాషలలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే విశాల్ నటించిన పందెం కోడి 2 చిత్రం తెలుగు, తమిళ బాషలలో రేపు విడుదల కానుంది.

అయితే రేపు విడుదలవుతున్న ఈ ఇద్దరు హీరోల చిత్రాలతో టాలీవడ్ లో ఏమైనా మార్పులు వస్తాయా?అదేవిధంగా ఎన్టీఆర్ స్పీడ్ కి ఈ ఇద్దరు హీరోలు బ్రేక్ వేస్తారా ? లేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడి ఎన్టీఆర్ ని ముందుకు వెళ్ళేలా చేస్తారా ? అయితే వీరిద్దరిలో దసరా బరిలో గెలిచేది ఎవరు అన్నది తేలాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే .