తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
మరో 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడి.
నలుదిక్కులా ఇప్పుడు నైరుతి పలుకరిస్తుంది.
మరో మూడు రోజులు భారీ వర్షాలు ఖాయమని వాతావరణశాఖ వెల్లడి.
రాజస్థాన్ నుంచి చత్తీస్గఢ్ మీదుగా.. తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
చత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
వీటి ప్రభావంతో తెలంగాణ, కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచన.