Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షాలు

Posted 5 months ago | Category : national

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై వరుణుడు పగబట్టాడా అన్న రీతిలో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా రైలు, రోడ్డు రవాణాతోపాటు విమాన సర్వీసులు సైతం స్తంభించిపోయాయి. నగర రోడ్లు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. దాదాపు పుష్కరకాలం తర్వాత ముంబయి ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.   బస్సులు, రైళ్లే కాదు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. అల్పపీడనం వాయుగుండంగా మారటంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరంతోపాటు పొరుగున ఉన్న నవీ ముంబై, ఠాణే జిల్లాను సైతం కుదిపేశాయి. శాంటాక్రుజ్ వాతావరణ కేంద్రంలో 126 మిల్లీమీటర్లు, కొలాబా స్టేషన్‌లో 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రైలు పట్టాలు నీట మునగడంతో ముంబైకి జీవనాడిగా చెప్పుకొనే సబర్బన్ రైళ్లను ఉదయం 11.30 గంటల తరువాత నిలిపివేశారు.కొన్ని గంటల పాటు బాంద్రా వర్లీ సీలింకు(సముద్రంపై నిర్మించిన బ్రిడ్జి మార్గం)ను సైతం మూసేశారు.

దాదాపు 22 ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడినట్టు అధికారులు చెప్పారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. నగరంలో సగటు వర్షపాతం కన్నా తొమ్మిదిరెట్లు అధిక వర్షం (కేవలం మూడు గంటల్లోనే) నమోదైందని, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబై విమానాశ్రయంలో విమానాలు దిగేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదు విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు దారి మళ్లించామని అధికారులు చెప్పారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విమానాశ్రయంలో రన్‌వే సైతం కనిపించడం లేదని తెలిపారు.

ముంబైతోపాటు మహారాష్ట్ర అంతటా కురుస్తున్న వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు. వరద ముంపుపై అప్రమత్తమైన నావికా దళం పరిస్థితి చేయిదాటితే సహాయ చర్యలకు వీలుగా హెలిక్యాప్టర్లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది.

భారీ వర్షాలకు తోడు అరేబియా సముద్రం కూడా పోటెత్తడం ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటల తరువాత మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడటం ప్రారంభమైంది. దీంతో తీర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇటు వర్షాలు, అటు అలల నీటిని తట్టుకొనే స్థాయిలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని అధికారులు పేర్కొన్నారు. పౌరులు తీర ప్రాంతంలో, బీచ్‌లకు విహారానికి వెళ్లకూడదని హెచ్చరించారు.

ముంబైతోపాటు పశ్చిమ మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని శాంటాక్రుజ్‌లోని వాతావరణ విభాగం తెలిపింది. ఈమేరకు రెడ్ వార్నింగ్ జారీ చేసినట్లు డైరెక్టర్ చరణ్‌సింగ్ వెల్లడించారు. ఒడిశాలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ దిశగా సాగుతున్నందున భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !