//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

Category : national

శ్రీలంక పరిసరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరి, దక్షిణ కోస్తాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా నవంబరు ఒకటికల్లా గల్ఫ్‌ ఆఫ్‌ సైమ్‌లో అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత 48 గంటల్లో అల్పపీడనం ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.