//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

Category : state

అల్పపీడ‌న ప్రభావంతో రాబోవు రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది. దీని ప్రభావం తో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది అని సమాచారం.

అలాగే ఉత్తరాంధ్రలోని ఉభయ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపడీన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలల ఉధృతి పెరగనుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ అల్పపీడన ప్రభావం తగ్గేవరకూ మ‌త్స్యకారులు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరంవెంబడి గంట‌కు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణశాఖ వెల్లడించింది.

Related News