భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ప్రత్యక్షంగా ద్వైపాక్షిక టోర్నీల్లో పాల్గొనే దారులు మూసుకుపోయాయి. దానితో ఈ రెండు దేశాల జట్ల మధ్య ఎక్కడా పోటీలు జరిగినా సర్వత్రా ఉత్కంఠత కలిగిస్తూ ఉంటుంది. పదేళ్ల తరువాత భారత్ - పాక్ జట్లు ఒక టోర్నమెంట్ ఫైనల్స్ లో తలపడుతూ ఉండడంతో ఆదివారం సాయంత్రం రెండు దేశాల జట్ల మధ్య లండన్ లో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విశేష ఆసక్తిని క్రికెట్ ప్రపంచంలో కలిగిస్తున్నది.
ఈ మ్యాచ్‌పై భారీ బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి. టైటిల్ పోరులో విరాట్ సేన ఫేవరేట్‌గా నిలిచింది. యూకేలో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ చట్టబద్ధంకావడంతో బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అంచనా ప్రకారం ఇప్పటికే రూ. 2 వేల కోట్ల బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. బూకీల ఫేవరేట్ భారత్ కావడంతో మార్జిన్ తక్కువగా అందనుంది.
టీంమిండియాపై రూ. 100 పెడితే రూ. 148 లభించనుంది. అదే పాకిస్థాన్ జట్టుపై రూ. 100 కాస్తే ప్రస్తుతానికి అత్యధికంగా రూ. 300 లభించనుంది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం కావడంతో భారతీయులు తమ అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్, ఈ-వాలెట్స్‌తో యూకే వెబ్‌సైట్స్‌కు లాగిన్ అయి బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇంతకు ముందు రెండు దేశాలు తలపడిన ప్రధాన పోటీలకు సంబంధించి 996 వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌పై 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2007 వరల్డ్ టి 20 ఫైనల్లో భారత్ చివరి ఓవర్లో ఆరు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 20 ఓవర్లలో 157 పరుగులు చేయగా, చివరి ఓవర్లో మిస్సాబ్ ఔట్‌ను చేయడంతో భారత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.
2011 వరల్డ్‌కప్ సెమీస్‌లో పాకిస్తాన్‌పై భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సచిన్ 85 పరుగులు చేయడంతో భారత్ 260/9 చేయగా, ఈ లక్ష్య సాధనలో పాక్ చిత్తు అయ్యింది.