//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డికి గుండెపోటు !

Category : national state

అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.

చెన్నైలో ఉన్న ఆయన తన నివాస గృహంలో మార్చి 23వ తేదీ శుక్రవారం అర్థరాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకీ గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక వార్డ్ లో అపోలో డాక్టర్ల బృందం చికిత్స చేస్తుంది.

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు తెలిపినట్లు తమిళనాడు పత్రికలు తెలిపాయి. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన మనవరాలినే చిరంజీవి కుమారుడు రాం చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.