Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏసీ వలన కలిగే నష్టం తెలిస్తే కొంచం జాగ్రత్తపడక తప్పదు..!

ప్రస్తుతం ఉన్న ఎండలకు “ఏసి” వదిలి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. దీనితో ఏసిలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎండా కాలం వచ్చింది అంటే అందరూ తమ ఇళ్ళల్లో ఏసీలు బిగిస్తున్నారు. దీనితో ఇల్లు కట్టే సమయంలోనే ఏసి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి పెడుతున్నారు. గతంలో ఎసి అంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఏసిలపై ఆధారపడుతున్నారు. ఏసి అనేది ఒక విలాస వస్తువు కాకుండా, అందరికీ నిత్యావసర వస్తువు అయిపొయింది. దీని వాళ్ళ పెరిగే కరెంటు బిల్లు గురించి కూడా ఎవరూ ఆలోచించటం లేదు. ఈ రెండు నెలలే కదా అనే ఉద్దేశంతో ఏసీ బాగానే వాడుతున్నారు.

దీనితో పలు కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఆఫర్లు ఇస్తున్నాయి. నెల వాయిదా పద్దతిలో కూడా ఏసిలను కొనే ఆఫర్లను దాదాపు అన్ని కంపెనీలు ఇవ్వడం గమనార్హం. ఇక ఫ్రిడ్జ్ కంటే ఏసీల మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే దీని వలన నష్టాలు ఏంటి అనేది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. దీని వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఏసి చల్లదనం శరీరానికి హాయిగా అనిపించినా, కళ్లకు మాత్రం శాపమని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఏసీలో ఎక్కువ గంటలు గడిపేవారు.. ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఇటీవల ఒక సంస్థ చేసిన సర్వేలో తేలింది.

వారంతా వేసవిలోనే ఈ జబ్బుకి గురవుతున్నారని గుర్తించారు. వారిలో చాలామంది రోజుకి 16నుంచి 18గంటలపాటు ఏసీలో గడుపుతున్నట్లు సదరు సర్వేలో వెల్లడైంది. ఇన్ని గంటలపాటు ఏసిలో గడిపేవారికే డ్రై ఐ సిండ్రోమ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువంటునే సంచలన విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో డ్రై ఐ సిండ్రోమ్‌ వస్తు౦దని చెప్తున్నారు. పై లక్షణాలు కనిపించిన వెంటనే ఏసిని ఆపి వేయడమో లేక మరోగదిలోకి మారడమో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కళ్ళకు మరింత ప్రమాదమని అంటున్నారు.

Related News