//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చర్మ సౌందర్యాన్ని కాపాడే బొప్పాయి , కీరా ఉండగా టెన్షన్ దండగ

Category : health

మన ఆహార అలవాట్లు , జీవనశైలి, కాలుష్యం, రేడియేషన్, మొబైల్ లేదా గాడ్జెట్స్ స్క్రీన్స్ లకు ఎక్కువగా ప్రభావితమవడం వంటి అనేక సమస్యల కారణంగా , మన చర్మం తరచుగా పెళుసుగా మారడం, పాడైపోవడం జరుగుతుంది. మొటిమల బారిన పడడం, మృత కణాలు పేరుకుని పోవడం, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, చారలు, వృద్దాప్య చాయలు, కంటి కింద వలయాలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఈ సమస్యలకు కారకాలు ఎన్ని ఉన్నప్పటికీ, కొన్ని చర్మ సంరక్షణా చర్యలను తీసుకుంటే మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. మనకు తక్కువ ఖర్చుతో దొరికే బొప్పాయి పండుతో , కీరా దోసకాయలతో మన చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసా ..

కీరా దోసకాయలోని హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని పుష్టిపరచడంలో, మరియు పాడైపోయిన చర్మాన్ని పునరుద్దరించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. అదేవిధంగా, కీరాదోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీది ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతాయి. దీనికి తోడు కీరాదోసకాయను తరచుగా ఉపయోగించడం ద్వారా వృద్దాప్య చాయల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.మొదటగా సగం కీరాదోసకాయను తీసుకుని తురమండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కీరాదోసకాయను కలపండి. ప్యాక్ చేసే క్రమంలో భాగంగా అర కప్పు సాదా పెరుగును కలపండి. ఈ కీరాదోసకాయ మరియు పెరుగు ప్యాక్ ను శుభ్రపరిచిన ముఖంపై అప్లై చేసి 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి.

బొప్పాయి మరో చర్మ సంరక్షిణి. విటమిన్ ఎ, సి , ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉండే బొప్పాయి చర్మాన్నికాపాడటంలో ఉత్తమంగా సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది పిగ్మెంటేషన్ మరియు నల్లమచ్చల చికిత్సలో కూడా సహాయపడుతుంది.ఇందుకు మీకు కావలసినవల్లా, 1 పండిన బొప్పాయి ముక్క, ముడి తేనె మరియు కొన్ని చుక్కల తాజా నిమ్మ రసం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ముడి తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి. అన్నిటిని పూర్తిస్థాయిలో మిక్స్ చేసి మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది డ్రై అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉండనివ్వాలి. సాధారణ నీటిని ఉపయోగించి దీనిని శుభ్రం చేయవచ్చు.