Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాళ్ళిద్దరూ ఒకే రకమైన జేర్సీలు వేసుకోవడానికి కారణం అదే..

Category : sports

విండీస్ క్రికెటర్లు సాంప్రదాయ క్రికెట్ లో విఫలం అయినా ఐపియల్ లాంటి టోర్నీలలో, పొట్టి ఫార్మాట్లలో సూపర్ హిట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఐపియల్ లో వారే స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఉంటారు. అటు దూకుడైన ఆట..ఇటు విలక్షణ ప్రవర్తన అన్ని రకాలుగా వారు ఏం చేసినా అది సంచలనంగానే ఉంటుంది. అయితే తాజాగా విండీస్ ఆటగాళ్ళు బ్రావో , పోలార్డ్ ఐపీల్ లో ఒకే నెంబర్ ఉన్న జేర్సీలు ధరించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసారు. ఇద్దరు 400 సంఖ్య ఉన్న జేర్సీలే ధరించగా...

బ్రావో 400 వికెట్లు, పొలార్డ్‌ 414 టీ20లు ఆడటంతో ఇద్దరూ చర్చించుకొని ఆ సంఖ్య గల జెర్సీలు వేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటె జట్టు ఓటమిపై పోలార్డ్ స్పందించాడు. ముంబై జట్టుకి ఆడుతున్న పోలార్డ్ మాట్లాడుతూ ‘మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా జట్టులో యువ ఆటగాళ్లు, ఉత్సాహం గల క్రికెటర్లు ఉన్నారు. ఒక సీనియర్‌ ఆటగాడిగా అది నన్ను ప్రేరేపిస్తోంది. తొలి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. ఇషాన్‌ కిషన్‌, మయాంక్‌ మర్కండే, పాండ్య సోదరులు ఆటను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేమందరం కలిసి తర్వాత మ్యాచ్‌కు ఆటతీరు మార్చేస్తామని చెప్పుకొచ్చాడు.

Related News