//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Gautham Reddy Issue | అయన అభిప్రాయాలు వై సి పి కి సంబంధం లేదు.........!

Category : politics

పూనూరి గౌతమ్ రెడ్డి,వై సి పి సభ్యుడినని తాను చేసిన వ్యాఖ్యలను పార్టీ సభ్యులు కండించారు.వివరాలలోకి వెళ్తే,

పూనూరి గౌతమ్‌రెడ్డి అభిప్రాయాలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌతమ్‌రెడ్డిని గతంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే గౌతమ్‌రెడ్డి తనను తాను వైసీపీ నేతగా పేర్కొంటూ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చిందని విజయ్‌సాయిరెడ్డి తెలిపారు.

ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉన్న గందరగోళానికి తెరపడినట్లైంది. అయితే గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రధాన కార్యదర్శి చేసిన ప్రకటన తనకు చేరలేదని, ఆ వివరాలు అందిన అనంతరమే తదుపరి ప్రణాళికపై స్పందిస్తానని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను పార్టీ బహిష్కరించిందంటూ కొందరు నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆపేందుకే తాను పార్టీలో కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చానని ఆయన తెలిపారు.

జగన్‌ నేరుగా తనను పార్టీలో కొనసాగాలని తెలిపినట్లుగా ప్రకటించిన విషయమై గౌతమ్‌రెడ్డిని అడగ్గా, తాను విలేకరుల సమావేశంలో జగన్‌ పేరు చెప్పలేదన్నారు. తనను సస్పెండ్‌ చేసినట్టు కూడా ఎలాంటి సమాచారం పార్టీ అధిష్టానం నుంచి నేటికీ అందలేదని గౌతమ్‌రెడ్డి మరోసారి గుర్తుచేశారు.

Related News