//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉప రాష్ట్రపతిని కలిసిన హర్షారెడ్డి తల్లిదండ్రులు

Category : national

అయ్యా మహారాష్ట్ర పుణెలోని ఖరాడిలో వొడాఫోన్‌ స్టోర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న మా కుమారుడు అదృశ్యమై ఏడాదిన్నర అవుతోంది.

దీనిపై అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కానీ ఇంత వరకు ఆచూకీ లేదు. ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ద్వారా మరోసారి పుణెలోని చందానగర్‌ పీఎస్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేశాం. మీరైనా మా అబ్బాయి అచూకీ ఎక్కడుందో తెలిపేందుకు సాయం చేయండి అని నున్నకు చెందిన గుదిబండి శ్రీ హర్షారెడ్డి (28) తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, భవానీ దంపతులు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును వేడుకున్నారు.

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్‌ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.కుమార్‌స్వామి ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి దంపతులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన వెంకయ్య వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేందర్‌ ఫడ్నవిస్‌తో ఫోన్‌లో కేసుపై మాట్లాడారు.

తక్షణమే యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్రీ హర్షారెడ్డి కేసుపై సమగ్ర విచారణ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మోహన్‌, బీజేపీ మండల అధ్యక్షుడు కొరప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

శ్రీహర్షారెడ్డి (28) అదృశ్యం వెనుక పుణెలోని వొడాఫోన్‌ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురి హస్తం ఉన్నట్లు అతని తండ్రి లక్ష్మారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పుణెలోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. వొడాఫోన్‌ కంపెనీలోనే తన కుమారుడితోపాటు పనిచేస్తున్న స్టోర్‌ మేనేజర్‌ పల్లె రమేష్‌, ఉద్యోగులు తోట రాంబాబు, లీగల్‌ టీమ్‌ ఇన్‌చార్జి శ్రీని వాసనాయుడుపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కుమారుడుకి చెందిన ల్యాప్‌టాప్‌ను శ్రీహర్షారెడ్డితోపాటు రూమ్‌లో ఉంటున్న తోట రాంబా బు దొంగిలించి పల్లె రమేష్‌కు అందజేశాడన్నారు. దీంతో అందులోని డేటాను తొల గించడంతోపాటు తన కుమారుడి మా యం వెనుక వీరి పాత్ర ఉందని అను మానం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురిని విచారిస్తే తన కుమారుడి గురించి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, శ్రీహర్షారెడ్డి అదృ శ్యంపై లక్ష్మారెడ్డి పుణెలోని పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కేసు విచారణకు పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌, నున్న ఎస్సై శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా పుణెకు పం పారు. నాలుగు రోజులపాటు పుణెలో విచారించిన ఎస్సై శ్రీనివాస్‌ ఆదివారం నగరానికి చేరుకున్నారు.