//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాప్-10లోకి దూసుకొచ్చిన హర్మన్‌ప్రీత్‌కౌర్

Category : sports

భారత స్టార్ బ్యాట్స్‌ ఉమెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చింది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అజేయ సెంచరీ (171)తో అదరగొట్టిన కౌర్(677) తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఇంగ్లండ్‌తో ఫైనల్లోనూ అర్ధసెంచరీతో రాణించడం కౌర్ మెరుగైన ర్యాంకింగ్‌కు కారణమైంది.

రెండోర్యాంకులో ఉన్న కెప్టెన్ మిథాలీరాజ్ (753), హర్మన్‌ప్రీత్‌తో కలిసి భారత్ నుంచి టాప్‌టెన్‌లో కొనసాగుతున్నది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు వరుస అర్ధసెంచరీలతో సత్తాచాటిన మిథాలీ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌ ఉమెన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ ల్యానింగ్ టాప్ బ్యాట్స్‌ ఉమెన్ గా కొనసాగుతున్నది. బౌలింగ్‌లో వెటరన్ పేసర్ జులన్ గోస్వామి నాలుగు ర్యాంక్‌లు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నది. శిఖాపాండే 12వ ర్యాంక్‌లో ఉండగా, పూనమ్ యాదవ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 28వ ర్యాంక్‌ను అందుకున్నది.

ఇలా ఉండగా, ప్రపంచకప్‌లో మన క్రికెట్ జట్టు ఫైనల్ చేరడం భవిష్యత్ మార్పునకు నాంది అని మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్‌తో సమాన గౌరవంతో పాటు ఆర్థిక అండదండలను ఆశిస్తున్నామని ఆమె తెలిపారు.

 "మెగా టోర్నీలో మేము అంచనాలకు మించి రాణించాం. దీంతో భారత్‌లో మహిళల క్రికెట్ మరో దశకు నాంది పడింది. ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇప్పటి వరకు మాపై ఉన్న దృక్పథం కచ్చితంగా మారుతుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు గౌరవం దక్కుతుందనుకుంటున్నాను. దీంతో అవకాశాలతో పాటు అమ్మాయిల కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతాయన్న నమ్మకముంది" అని మిథాలీ విస్వాసం వ్యక్తం చేసారు.