//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హ‌రీశ్‌రావును ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం..!

Category : state politics

హ‌రీశ్ అన్న‌కే మా ఓటు అని అంటున్నారు ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు. హ‌రీశ్‌రావే త‌మ‌కు ఎమ్మెల్యేగా మ‌ళ్లీ కావాల‌ని వారు బ‌లంగా కోరుకుంటున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌మ ఓటు గురించి హ‌రీశ్‌రావు విష‌యంలో ముందుగానే ప్ర‌క‌టిస్తున్నారు. గ్రామ‌స్తులంతా క‌లిసి ప‌లాన పార్టీకే.. ప‌లాన వారికే ఓటేస్తామంటూ ఏక‌గ్రీవంగా తీర్మానిస్తున్నారు. ఏక‌గ్రీవ తీర్మానాలు ఎక్కువ‌గా అధికార పార్టీ టీఆర్ఎస్ వైపే ఉండ‌టం విశేషం.Harish Rao will win with a lakh Majority

తాజాగా, సిద్దిపేట‌లో ఏక‌గ్రీవ తీర్మానాలు కొన‌సాగుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్ర‌మిస్తున్న హ‌రీశ్‌రావు ఎమ్మెల్యేగా ఉండాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ప్ర‌జా సంఘాలు సంస్థ‌లు కోరుకుంటున్నాయి. అందులో భాగంగా నీల‌కంఠం గ్రామం వారు స‌మావేశ‌మై హ‌రీశ్‌రావుకే త‌మ మ‌ద్ద‌తు అని ఏక‌గ్రీవంగా తీర్మానించారు. Harish Rao will win with a lakh Majority

ప్ర‌తీ ఇంటి నుంచి ఏక‌గ్రీవంగా తాము హ‌రీశ్‌రావు అభ్య‌ర్ధిత్వాన్ని బ‌ల‌ప‌రుస్తున్న‌ట్టు తెలియ‌జేస్తూ తీర్మాన కాపీలో మంత్రి హ‌రీశ్‌రావుకు పంపాల‌ని నిర్ణ‌యించారు. అదే క్ర‌మంలో చిన్న కోడూరు గ్రామంలో యాద‌వ‌సంఘం నేత‌లు స‌మావేశ‌మై మంత్రి హ‌రీశ్‌రావే త‌మ‌కు ఎమ్మెల్యే అని, ఆయ‌న‌కే త‌మ ఓటు అని ఏక‌గ్రీవ తీర్మానం చేశారు.

త‌మ గ్రామ అభివృద్ధితోపాటు.. త‌మ సామాజిక‌వ‌ర్గానికి చేసిన మేలు అంతా.. ఇంతా కాద‌ని తాము తిరిగి హ‌రీశ్‌రావును గెలుపించుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. మొత్తం ల‌క్ష మెజార్టీతో హ‌రీశ్‌రావును త‌మ ఎమ్మెల్యేగా మ‌ళ్లీ గెలిపించుకుంటామ‌ని సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చెబుతున్నారు.Harish Rao will win with a lakh Majority

Related News