//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హరీష్ సారూ మర్చిపోయారా ?

Category : politics

రాజకీయ నేతలంటే ఒకప్పుడు అందరికి ఎంతో గౌరవం ఉండేది. రానురాను రాజకీయ నేతలంటే గౌరవం పోయి విల్లు అసలు రాజకీయనాయకుల అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పటి రాజకీయనాయకులు ఎప్పుడు పడితే అప్పుడు, అక్కడ పడితే అక్కడ, ఎవరిమీదైనా గొడవలకు దిగుతున్నారు.

ఇంతకముందు వున్నా రాజకీయ నేతలు ఎంతో హుందాగా ప్రవర్తించారు. వారిని ఆసరాగా తీసుకుకొని ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంభందించిన 2018-19 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు అసెంబ్లీ ఆనవాయితి ప్రకారం గవర్నర్ గారు వచ్చి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండగానే విపక్ష కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టి పోడియం ముట్టడికి ప్రయత్నించారు. ఇది గమనించిన అక్కడి మార్షల్స్ కాంగ్రెస్ నేతలను పోడియాన్ని చుట్టూ ముట్టకుండా అడ్డుకున్నారు. దీనితో అక్కడ కొద్దిపాటి తోపులాట జరిగింది.

ఈ తరుణం లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ ఫై హెడ్ సెట్ విసిరాడు. అది శాసన మండలి చైర్మైన్ కంటికి తగిలింది. దీనితో ఆయనను హుటాహుటిన సరోజినీ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయం లో కాంగ్రెస్ నేతలపై తెరాస నేతలు తీవ్రమైన విమర్శలు చేసారు. కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారని వారిని క్షమించరాదని అన్నారు.

ఈ విషయం లో కోమటిరెడ్డి ఫై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి ఇలాంటి వాటికీ భయపడేది లేదని అన్నారు.అలాగే ఆయన తెరాస నేతలపై విమర్శలు చేసారు.

గతం లో హరీష్ రావు ఉమ్మడి రాష్ట్రం లో గవర్నర్ ఫై దాడికి పోలేదా అని అయన ప్రశ్నించారు.ఈపరిస్థితులలో హరీష్ రావు ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ మీదకు దాడి చేసేందుకు టేబుళ్ల మీదనుంచి దూకిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీ బయటకు తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోంది. అప్పట్లో హరీష్ రావు ఎంత దూకుడు ప్రదర్శించారన్న విషయాన్ని జనాలకు చెప్పేందుకే ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

మరోవైపు హరీష్ రావు మాట్లాడుతూ కోమటిరెడ్డి దాడికి సంబందించిన వీడియోలను చూస్తున్నామని, దాడి తీవ్రతను బట్టి చర్యలుంటాయని చెప్పారు. ఏది ఏమైనా రాజకీయనాయకులు కొంచెం దూకుడు తనాన్ని తగ్గించుకోవాలి లేకపోతె వాళ్ళు ముందు ముందు చాలా సమస్యలను ఎదుర్కోవలిసిన పరిస్థితులు వస్తాయి.

ఒక్కపుడుయితే నేతలు ఏది చెబితే ఏది వినేవారు జనాలు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఎప్పుడు జరిగిన వీడియోలు అయిన గూగుల్ దర్శనమిస్తున్నాయి. అందువల్ల రాజకీయ నేతలు చూసుకొని మసలుకుంటే వారికే మంచిది. ఈ విషయం ఎంతవరకు పోతుందో వేచి చూడాలి.

కాంగ్రెస్ వైరల్ చేస్తున్న హరీష్ రావు వీడియో.....

Related News