Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సిద్ధిపేటలో కర్ణాటక బ్యాంకు ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి .

Category : politics state

దిన దినం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా, జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అభివృద్ధి చెందుతున్న తరుణంలో కర్ణాటక బ్యాంకు రావడం సిద్ధిపేట వ్యాపార వేత్తలకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో గురువారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ఛీఫ్ మేనేజర్ కులన్ దాయన్, జనరల్‌ మేనేజర్‌ మురళీధర కృష్ణారావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కర్ణాటక బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేటలో కర్ణాటక బ్యాంకు ప్రారంభించినందుకు బ్యాంకు యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాదు కేంద్రంగా 85 శాఖలతో మన తెలుగు రాష్ట్రాలలో ఈ బ్యాంకు సేవలు అందిస్తుందని., తెలంగాణ రాష్ట్రంలో 25 శాఖలు ఉన్నాయంటూ.., ప్రైవేటు రంగంలో చాలా బాగా నడిచే బ్యాంకుగా పేరొందిందని వివరించారు. బ్యాంకు మేనేజ్మెంట్, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి, జిల్లా అధికారిక, ప్రజాప్రతినిధుల ద్వారా సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణంలో కర్ణాటక బ్యాంకు రావడం సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రంలో 25వ బ్రాంచ్ ను సిద్ధిపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

సిద్ధిపేట అభివృద్ధి పథంలో నడుస్తున్న తరుణంలో కర్ణాటక బ్యాంకు రావడం పట్టణ ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మేరకు ఏటీఎం కౌంటర్ కేంద్రాన్ని ప్రారంభించి క్యాష్ డిపాజిట్ చేసే తీరును హరీశ్ రావు, కలెక్టరుకు జనరల్‌ మేనేజర్ మురళీధర కృష్ణారావు చూపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ విజయ్ క్రిష్ణ, అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ అనిల్, ప్రముఖ వ్యాపార వేత్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.