//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇండియాలోనే చరిత్ర సృష్టించిన హరీష్ రావు

Category : politics state

తానీరు హరీశ్ రావు జూన్ 3, 1972 లో జన్మించారు , తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు .హరీశ్ రావు మెదక్ జిల్లా సిద్దిపేటలో సత్యన్నారాయణ మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆయన TRS వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడు.

హరీశ్ రావు సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం శాసన సభ్యునిగా 32 వ సంవత్సరం లో 2004 లో ఎన్నిక అయ్యాడు

KCR గారు సిద్ధిపేట శాసన సభ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నిక అయినందున సిద్ది పేట సీటును విదిలి వేశారు కెసిఆర్ , ఆ ప్లేస్ లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నిక అయ్యి పోటీ చేసారు , అప్పుడు హరీష్ రావు స్టడీ పూర్తి చేసు కొని రాజకియాల్లోకి వచ్చారు . ఆ తర్వాత తెరాస లో కీలక రాజకియ నేతగా ఎదిగారు , ఆ నియోజక వర్గం లో ప్రజలు ఆశీస్సలతో పోటీ చేసిన ప్రతి సారి గెలుస్తూ వచ్చారు , తెలంగాణ ఉద్యమ సమయం లో హరీష్ రావు చేసిన పాత్ర ఎవరు మర్చిపోరు , కెసిఆర్ తో కలిసి రాష్ట్ర ప్రజలతో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు

తెలంగాణ రాష్ట్ర యేర్పాటు కొరకు విశ్రాంతి లేకుండా ఉద్యమాలు చేసారు , కెసిఆర్ కి వెన్నుముక లాంటి వారు , 2008 లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు UPA ప్రభుత్వం తన కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ యేర్పాటు ఉన్నప్పటికి ఆ రాష్ట్ర యేర్పాటుకు జాప్యం చేస్తున్నందున దానికి నిరసన తెలియజేస్తూ హరీష్ రావు గారు రాజీనామా చేసారు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో సిద్ది పేట లో పోటీ చేసారు .2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యాక రాజీనామా చేయడంతో హరీష్ పోటీ చేసి, గెలిచారు. నాడు హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనను తన కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి హరీష్ వరుసగా 5సార్లు గెలిచారు. 2004 ఉప ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో, 2009 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 2018లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ఈసారి కూడా గెలిస్తే హరీష్ రావు రికార్డ్ సృష్టించనున్నారు. ఒకటి 14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలవడం. మరొక కీలకమైన రికార్డ్ ఉంది. 46 ఏళ్లకే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జాతీయస్థాయి రికార్డ్ సృష్టించనున్నారు.

2010 మొదట్లో UPA ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నందుకు నిరసనగా మల్లి తెరాస రాజీనామా చేసింది. హరీశ్ రావు మల్లి ఉప ఎన్నికలలో పోటీచేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించారు , 2009 లో పులివెందుల నియోజక వర్గంలో వై.యస్.రాజశేఖరరెడ్డి సాధించిన 68,681 ఓట్ల రికార్డును అధికమించారు.ఓవరాల్ గా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాళ్లలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 13 సార్లు గెలిచి టాప్ లో ఉన్నారు.