//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్ ఫై హరి బాబు స్పందన !

Category : politics

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చే విధంగా ఉందని బీజేపీ ఎంపీ హరిబాబు వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి నష్టం జరగలేదని అన్నారు.

విభజన చట్టంలోని పేర్కొన్న ఐదు సంస్థలు రావాల్సి ఉందని, సెంట్రల్, గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయించారని, విభజన చట్టంలో రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపైనే జైట్లీ ప్రస్తావించారని హరిబాబు పేర్కొన్నారు. అధికారుల నివేదికతో సంబంధం లేకుండా రైల్వేజోన్‌పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.

ఏపీ విభజన చట్టంలో ఐదు హామీలు రావాలని అందులో గిరిజన వర్కసి విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ మిగిలిన వాటిపై కేంద్రం చొరవ తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర వేసిన అధికారుల కమిటీ ఏర్పాటుకు సానుకూల నివేదిక ఇవ్వలేదని హరిబాబు అన్నారు.

Related News