//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడ్డంగా బుక్కయిన హార్దిక్ : లీకయిన సెక్స్ వీడియో - వైరల్

Category : national

రెండు రోజుల కింద‌ట హ‌ర్ధిక్ ప‌టేల్ రాస‌లీల‌ల పేరిట త‌నపై బుర‌ద జ‌ల్లేందుకు బీజేపీ కుట్ర‌లు ప‌న్నుతోందని హింట్ ఇచ్చాడు. రెండురోజుల్లో సిడీలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పాడు.

అలా చెప్పాడో లేదో ఇలా ఓ అమ్మాయితో హర్దిక్ ప‌టేల్ ఏకాంతంగా ఉన్న సిడీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ సెక్స్ సీడీ ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆయన బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు కూడా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాసలీలల సీడీ బయటపడడం రాజకీయంగా పెను దుమారమే లేపుతోంది.

గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ బయటపడడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మే 16న చిత్రీకరించినట్టు రికార్డయిన ఆ సీడీలో హార్ధిక్‌ లా వున్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎన్నిక‌ల వేళ పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాసలీలల వీడియో క‌ల‌క‌లం రేపింది. తన సెక్స్ సీడీ బయటపడడంపై హార్ధిక్ పటేల్ స్పందించాడు. అయుతే ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని చెప్పుకొచ్చాడు హ‌ర్దిక్ పేట‌ల్. త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని…. తాను నపుంస‌కుడిని కూడా కాదంటూ కామెంట్స్ చేశాడు.

బీజేపీ ఇలా దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించాడు. త‌న పవర్ ఏంటో బీజేపీకి బాగా తెలుసు కాబట్టే.. నన్ను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలు ఎలాంటి నీచానికైనా వెనుకాడంటం లేదని.. అయితే వీరి దుర్మార్గపు చర్యల వల్ల గుజరాత్ మహిళల ప్రతిష్ట దెబ్బతింటుందనే సత్యాన్ని గ్రహించాలన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ అన్నాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.

నాలుగు నిమిషాలు నిడివి ఉన్న సెక్స్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అచ్చం హార్థిక్ పటేల్‌లానే ఉండటంతో ఈ సీడీ ఆయనదేనంటూ వ‌స్తున్న వార్త‌లు హల్‌చల్ చేస్తున్నాయి.