//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుప్పకూలిన హార్థిక్ పాండ్యా : కారణం ఇదే...

Category : sports

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. దాయాదులు మధ్య జరుగుతున్నా పోరులో ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 18వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా జరిగింది ఈ సంఘటన. అనతంరం తన నడుమును పట్టుకొని పిచ్‌పై పడుకున్నాడు.

వెంటనే తోటి క్రికేటర్లు , జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి తన గాయాన్ని పరిశీలించారు. గాయం పెద్దదని గ్రహించిన ఫిజియో హార్థిక్ ని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. మిగిలిన బంతిని అంబటి రాయుడు వేసాడు. చివరికి పాకిస్తాన్ 43 .1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మరియు జాదవ్ లు 3 వికెట్స్ తీయగా, బుమ్రా రెండు మరియు కులదీప్ ఒక వికెట్ తీసాడు.