ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది తనను చెన్నై కొనుగోలు చేయడంపై స్పందించిన భజ్జి సంతోషం వ్యక్తం చేశాడు.
ట్విట్టర్ వేదికగా ఓ తమిళ పాటలోని చరణాన్ని ఉపయోగిస్తూ కృతజ్ఞతలు తెలిపాడు మీ తరపున ఆడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ గడ్డ నన్ను సింహంలా తయారుచేస్తుంది అని తమిళంలో ట్వీట్ చేసి తమిళ తంబిల అభిమానాన్ని చూరగొన్నాడు మొదటి పది ఐపీఎల్ సీజన్లలో హర్భజన్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.