Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హర్భజన్ ని ధోని అందుకే వద్దన్నాడు

Category : sports

టీం ఇండియా మాజీ సారధి వ్యూహాలు ఎవరికి అంతుబట్టవు విజయం కోసం ఎలాంటి సాహసం అయినా చెయ్యడానికి ధోని ఏ మాత్రం సంకోచించాడు. తాజాగా జరిగిన ఐపియల్ ఫైనల్ లో ఇదే జరిగింది. ఎంతో అనుభవం ఉన్న హర్భజన్‌ సింగ్‌ను కాదని... అంతగా అనుభవం లేని కర్ణ్‌ శర్మకు తుది జట్టులో చోటు కల్పించాడు ధోనీ. ఇలా ఎందుకు చేసాడు అనేది ఎవరికి అర్ధం కాలేదు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు.

‘ధోనీ ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తాడు. అతనిపై ఆ నమ్మకం ఉంది. అందుకే ఫైనల్‌ ఆడే తుది జట్టులో చోటు దక్కకపోయినా నేను ఏమాత్రం బాధపడలేదు. ధోనీ వ్యూహం ప్రకారం బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులేసే బౌలర్‌ కావాలి. ఫింగర్‌ స్పిన్నర్లతో చూసుకుంటే మణికట్టు స్పిన్నర్లు ఐపీఎల్‌లో చాలా ఎక్కువ ఓవర్లు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఈ పరిస్థితి మారుతుందని భావిస్తున్నా. తుది జట్టులో స్థానం దక్కించుకుని కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ తీసిన కర్ణ్‌ శర్మకు అభినందనలు’ అని భజ్జీ వివరించాడు.