//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెటర్ల ఎంపిక తీరుపై హ‌ర్భ‌జ‌న్ ఆగ్రహం.. ధోనికి అంత విలువెందుకు ?

Category : sports

చాంపియ‌న్స్ ట్రోఫీకి త‌న‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ సెల‌క్ట‌ర్ల‌పై మండిపడ్డారు. సెల‌క్ట‌ర్లు ద్వంద ప్రమాణాలు అనుసరిస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీకి ఇచ్చినంత విలువ అంత‌క‌న్నా సీనియ‌ర్ అయిన త‌న‌కు ఎందుకు ఇవ్వ‌రని ప్ర‌శ్నించాడు. 

ఫామ్‌లో లేక‌పోయినా ధోనీ ఎంపిక చేసిన‌వాళ్లు త‌న‌ను ఎందుకు చేయ‌ర‌ని భ‌జ్జీ అడిగాడు. బ్యాటింగ్‌లోనే కాదు అనుభ‌వం, అత‌ని వ్యూహాలు కూడా టీమ్‌కు ప‌నికొస్తాయ‌నే ధోనీని సెల‌క్ట్ చేసిన‌ట్లు చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ చెప్పాడు. 

అయితే అనుభ‌వం విష‌యంలో తానేమీ త‌క్కువ కాద‌ని హ‌ర్భ‌జ‌న్ అంటున్నాడు. అత‌ను ఫామ్‌లో ఉన్నా లేక‌పోయినా టీమ్‌లో ఉంటే మిగ‌తా యువ‌కుల‌కు స్ఫూర్తిగా నిలుస్తాడు నిజ‌మే. అత‌నికి క‌లిసొచ్చేది అదే. నా విష‌యంలో మాత్రం అలా ఎప్పుడూ జ‌ర‌గలేదు. అత‌నికిచ్చిన విలువ నాకు ఇవ్వ‌లేదని వాపోయాడు. 

"నేను కూడా 19 ఏళ్లుగా ఆడుతున్నా. రెండు వ‌రల్డ్‌క‌ప్ గెలిచాను. కానీ కొంద‌రికీ ఆ గౌర‌వం ద‌క్కుతుంది. ఇంకొంద‌రికి ద‌క్క‌డం లేదు. అందులో నేను ఒక‌డిని" అని హ‌ర్భ‌జ‌న్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ టీమ్ ఎంపిక‌లో గంభీర్ లేదా త‌న పేరును క‌నీసం చ‌ర్చ‌కు కూడా తీసుకురాక‌పోవ‌డంపై హ‌ర్భ‌జ‌న్ గుర్రుగా ఉన్నాడు. 

ఐపీఎల్‌లో 6.48తో ముంబై త‌ర‌ఫున అత్య‌ధిక ఎకాన‌మి రేటు హ‌ర్భ‌జ‌న్ పేరిటే ఉంది. అయినా త‌న‌ను ఫైన‌ల్లో ఆడించ‌క‌పోవ‌డంపై కూడా భ‌జ్జీ అసంతృప్తి వ్య‌క్తంచేశాడు. ఇలాంటి టోర్నీల్లో ఆడేది ఇండియ‌న్ టీమ్‌కు ఎంపిక కావ‌డానికే అని, అలా జ‌ర‌గ‌న‌పుడు ప్ర‌యోజ‌నం ఏంటని ప్ర‌శ్నించాడు.

 అశ్విన్ ఫిట్‌గా లేక‌పోతేనే న‌న్ను ఎంపిక చేస్తారు. చాంపియ‌న్స్ ట్రోఫీకి సిద్ధంగా ఉండాల‌నే అత‌నికి ఐపీఎల్ నుంచి రెస్ట్ ఇచ్చారు. కానీ ఒక ప్లేయ‌ర్ బాగా ఆడిన‌పుడు అత‌న్ని గుర్తించాలి. ఇద్ద‌రు ప్లేయ‌ర్స్‌కు వేర్వేరు రూల్స్ ఎలా వ‌ర్తిస్తాయి అని హ‌ర్భ‌జ‌న్ సెల‌క్ట‌ర్ల తీరును తప్పుబట్టారు. 

ఇలా ఉండగా, ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017లో తలపడేందుకు కోహ్లీ సేన ఇంగ్లాండ్‌ చేరుకుంది. జూన్‌ 1 నుంచి 18వరకూ ఇంగ్లాండ్‌, వేల్స్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. గ్రూప్‌-బిలో ఉన్న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టబోతోంది. జూన్‌ 4న ఈ మ్యాచ్‌ జరగనుంది. ప్రధాన టోర్నీకి ముందు భారత్‌ తన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.