//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డబ్బుతో `సంతోషం' కొనుక్కోవచ్చట !

Category : editorial

సంతోషం డబ్బుతో వచ్చెడిది కాదని, అది హృదయానికి సంబంధించినదని అనుకొంటుంటాము. అయితే డబ్బుతో దానిని కొనుక్కోవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు. రోజువారీ పనులను డబ్బిచ్చి ఇతరులతో చేయించుకొంటే  లభించే `మిగులు సమయం' ను సంతోషంగా ఉండటానికి మలుచుకోవచ్చని సూచిస్తున్నారు.

రోజువారీ ఇంట్లో శుభ్రం చేయడం, అంట్లు తోమటం,  వస్త్రాలు ఉతకడం, సరుకులు కొనుగోలు చేయడం వంటి పనులను మనం చేసుకొంటూ ఉండే బదులు, డబ్బిచ్చి సహాయకులతో చేయించుకో గలిగితే ఆ సమయాన్ని సంతోషకరమైన అనుభవాల కోసం ఉపయోగించు కొంటున్నట్లు ప్రొఫెసర్ ఎలిజబెత్ డ్యూన్ తెలిపారు.ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి అని కూడా చెప్పారు.

ఆ విధంగా లభించే `మిగులు సమయం' ప్రయోజనాలు కేవలం సంపన్నులకు మాత్రమే కాదని, అన్ని ఆదాయ వర్గాల వారికి వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. పరిశోధకులు అమెరికా, కెనడా, డెన్మార్క్, నెథర్లాండ్ లలో 6,200 మందిని పైగా సర్వే చేశారు. రోజువారీ పనులకు కేటాయించే సమయాన్ని ఆదా చేసుకోవడం ద్వారా ఏ విధంగా ఉపయోగించు కొంటున్నారని అంటూ వారిని ప్రశ్నించారు.

తమ ఖాళీ సమయాన్ని ఏవిధంగా ఉపయోగించు కొంటున్నారు, జీవితంపై ఏమేరకు  సంతృప్తి పొందుతున్నారు, మీ సమయంపై వత్తిడి ఏమేరకు ఉంటున్నది వంటి పలు ప్రశ్నలు కూడా వేశారు. ఈ అధ్యనంలో భాగంగా 60 మందికి 40 డాలర్లు చొప్పున (సుమారు రూ 2,000) ఇచ్చి ఒక వారం చివరిలో వస్తువులు కొనుగోలుకు, మరో వారం చివరిలో సమయం ఆదా చేసుకోవడం కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. సమయం ఆదా చేసుకోవడం కోసం ఖర్చుపెట్టిన వారు సంతోషంగా ఉన్నట్లు గమనించారు.

అయితే చాలామంది సమయాన్ని ఆదా చేసేందుకు సేవలకు స్తోమతు ఉన్న డబ్బును ఖర్చు పెట్టడానికి  సిద్దపడటం లేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న 818 మంది మిలియనీర్లలో సగం మంది "మా పనులు  మేమె చేసుకొంటాము. వాటి కోసం అవుట్ సోర్సింగ్  కు ఇష్టపడము" అని చెప్పారు. ఈ మధ్య పలు దేశాలలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నది. పెరుగుతున్న ఆదాయాలు వారిలో మరింత ఎక్కువ సమయ భద్రతను కలిగిస్తున్నదని పరిశోధకులు పేర్కొన్నారు.

Related News