//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హమ్మయ్య జషిత్‌ క్షేమం మంచివార్త

Category : editorial

రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బాలుడు జషిత్‌ కథ సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపర్ల బారి నుంచి జషిత్‌ క్షేమంగా బయటపడ్డారు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి ఇంటి వద్దే జషిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. నాయనమ్మ పార్వతిపై దాడి చేసి బాలుడిని ఎత్తుకెళ్లారు. పోలీసులకు జషిత్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో బాలుడి కోసం పదిహేడు పోలీసులు బృందాలు రాత్రింబవళ్లూ జల్లెడ పట్టాయి. వేలాది మంది నెట్‌జన్లు సోషల్‌మీడియాలో బాబు ఫొటో షేర్‌ చేస్తూ తమ వంతుగా సహకరించారు.

జషిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాలుడి ఆచూకి తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. జషిత్‌ క్షేమంగా ఉండడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.జషిత్‌ తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. జషిత్‌ తండ్రి మండపేట యూనియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా నూక వెంకటరమణ పనిచేస్తున్నారు. తల్లి నాగవళి కెనరా బ్యాంకు ఉద్యోగి. వీరికి 2014లో పెళ్లియింది. ఏడాది తరువాత ఈ దంపతులకు జషిత్‌ జన్మించాడు. వీరికి 2014లో పెళ్లియింది. ఏడాది తరువాత ఈ దంపతులకు జషిత్‌ జన్మించాడు