//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సగం మంది ప్రజల భాషలు అంపశయ్యపై

Category : national

దేశవ్యాప్తంగా 130 కోట్లమంది ప్రజలు మాట్లాడుతున్న భాషల్లో సగం అంపశయ్యపై ఉన్నట్లుగా తాజా సర్వేలో వెల్లడైంది. వచ్చే 50 ఏళ్లలో ఈ భాషలు అంతరించిపోనున్నట్లు 'పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(పిఎస్‌ఎల్‌ఐ)' చేసిన సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 780 భాషలు వాడుకలో ఉన్నాయని, 2067 నాటికి సుమారు 400 భాషలు కనుమరుగయ్యే సూచనలు ఉన్నాయని పిఎస్‌ఎల్‌ఐ చైర్మన్‌ జిఎన్‌ డెవీ చెప్పారు. గత 50 ఏళ్లలో 250 భాషలు అంతరించిపోయాయన్నారు. భాషతో పాటే ఆయా సంస్కృతులు కూడా కనుమరుగౌతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతులు, భాషలు ముందుగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన 22 అధికార భాషల్లోనే పాఠశాలల్లో బోధన ఉండటంతో గిరిజన విద్యార్థులు తమ మాతృభాషకు దూరమవ్వనున్నరని పేర్కొన్నారు.