సోమవారం అమెరికా ప్రభుత్వం H1B వీసాల స్వీకరణ మొదలు పెట్టింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజి కౌంటీ లోని అతి పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్ లో వీసాల స్వీకరణ జరుగుతుంది. సోమవారం గేట్లు తెరిచిన వెంటనే మొదటి పెడిక్స్ కొరియర్ ట్రక్ 15000ల వీసా అప్లికేషన్లను డెలివరీ చేసింది. ఆ గేటు ముందు ఎన్నో ట్రక్కులు బారులు తీరి ఉన్నారు. అన్ని ట్రక్కుల వీసా దరఖాస్తుల తో నిండి ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం వీసా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే రెండు లక్షలకు మించటంతో ఇక కొత్త అప్లికేషన్లు తీసుకోకూడదని అక్కడి అధికారులు నిర్ణయించి అప్లికేషన్ల స్వీకరణ నిలిపివేస్తారు. ఈ కాస్త సమయాన్ని 'వీసా విండో ' అంటారు. ఎవరు ముందు అప్లికేషన్ ను ఈ ఆఫీసుకు చేర్చటంలో సఫలీకృతులవుతారో వారికే వీసా లాటరీ లో ఛాన్స్ దొరుకుతుంది. అందుకే అన్ని కొరియర్ సంస్థలు సమయానికి దరఖాస్తులను చేర్చటానికి పోటీ పడతాయి. స్వీకరణ నిలిపివేసిన తరువాత వచ్చిన అప్లికేషన్లను లెక్కలోకి తీసుకోరు కనుక వారు మళ్ళీ సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే. పోయిన సంవత్సరం 2,36,000 మంది దరఖాస్తులను ఈ ఆఫీసు స్వీకరించింది. వీటి నుండి 65,000 మందిని కంప్యూటర్ రాండమ్ గా ఎన్నుకుంటుంది. వారికే అమెరికా లో H1B తాత్కాలిక విదేశీ నిపుణిడిగా పని దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు కొందరు ప్రీమియం ప్రోసెసింగ్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఏన్నో కొరియర్ సంస్థలు లాభపడతాయి. ప్రపంచం నలుమూలల నుండి అమెరికాలో కాలు మోపాలని ఉవ్విళ్లూరే ఎంతో మంది ఆశలు, భవిషత్తును ఈ కొరియర్లు సరైన సమయం లోపు చేర్చడం ఫై నిర్భరమై ఉంటుందనటం అతిశయోక్తి కాదు. గుడ్ లక్ టూ అల్ H1B అప్లికెంట్స్ వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా కొత్త రూల్స్, కొత్త ఆంక్షలు వుంటాయి కనుక ఈ సారి ఎవరు చోటు దక్కించుకుంటే వారే అదృష్టవంతులు .