చేయి చేయి కలిపి అడుగులు వేస్తే అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయి. ఒక్కరిగా చేయలేనిది అందరం ఒక్కటై చేయగలం అనే సత్యాన్ని నాట్స్ ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంది. నాట్స్ తో కలిసి వచ్చే ప్రతి సభ్యుడికి తగిన గౌరవం ఇస్తుంది. తగిన ప్రాధాన్యం కల్పిస్తుంది.
ఈ క్రమంలోనే నాట్స్ కి ఇప్పటి వరకు సేవలు అందిస్తూ వచ్చిన వారికి తగిన రీతిన సత్కరించుకుంది. ప్రతి ఏడాది జరిగే సాధారణ మార్పులు ఈ ఏడాది కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ఇక ఈ ఏడాది నుండి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, స్థానిక లయన్స్ క్లబ్ లో యాక్టివ్ మెంబెర్ అయిన గుత్తికొండ సుభాష్ చంద్ర బోస్ కుమారుడే గుత్తికొండ శ్రీనివాస్, అమెరికాలోని క్లియర్ వాటర్, ఫ్లోరిడా లో ఈయన ప్రఖ్యాత ఐటీ వృత్తి నిపుణులు. స్వశక్తి తో పైకెదిగిన ఆయన ఇప్పుడు రెండు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్నారు.