Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీబీఐ కోర్ట్ నుండి పారిపోవాలని చూసిన గుర్మీత్

Posted 5 months ago | Category : national

తనను కోర్ట్ దోషిగా తెలిస్తే అనుచరులతో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడం ముందుగానే పధకం సిద్ధం చేసిన డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్‌, కోర్ట్ నుండి పారిపోవాలని కూడా పధకం వేసుకున్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలని చూసాడు. ఒకసారి తప్పుకొని, వేల సంఖ్యలో ఉన్న మద్దతు దారుల మధ్యకు వెడితే, వారు మానవకవచంగా ఏర్పడి తనను తాకనీయరని పధకం వేశాడు.

పైగా, అత‌ని ర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన భ‌ద్ర‌తా సిబ్బందే అందుకు ప్రయత్నం చేసినట్లు వెల్లడైనది. స్వయంగా హ‌ర్యానా పోలీసులే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. రేప్ కేసులో అత‌ను దోషి అని కోర్టు తేల్చిన త‌ర్వాతే గుర్మీత్‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం  క‌చ్చితంగా జ‌రిగింద‌ని పోలీసులు చెబుతున్నారు. గుర్మీత్‌కు ర‌క్ష‌ణ‌గా ఉన్న‌ది హ‌ర్యానా పోలీసులే. వాళ్ల‌తోపాటు మ‌రికొంద‌రు ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నారు. కోర్టు తీర్పు త‌ర్వాత అత‌ను త‌న ప్రైవేట్ వెహికిల్‌లో త‌ప్పించుకుని వెళ్లేలా ప్లాన్ చేశారు.

గుర్మీత్‌ను జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ స‌హా అక్క‌డి నుంచి త‌ప్పించి అత‌నికి మ‌ద్ద‌తుగా ఉన్న ల‌క్ష‌ల మంది అనుచ‌రుల మ‌ధ్య‌లోకి తీసుకెళ్లాల‌ని చూశారు. అదే జ‌రిగి ఉంటే అత‌న్ని అరెస్ట్ చేయ‌డం మాకు చాలా క‌ష్ట‌మ‌య్యేది అని ఓ హ‌ర్యానా పోలీస్ అధికారి వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి.. అక్క‌డే ఉన్న కొంద‌రు పోలీస్ అధికారులు, పారామిలిట‌రీ సిబ్బంది గుర్మీత్‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా అత‌ని ప్రైవేట్ సెక్యూరిటీతో వాళ్లకు కాస్త గొడ‌వ కూడా జ‌రిగింది. వెంట‌నే వారిని ప‌క్క‌నే ఉన్న మ‌రో గ‌దిలో బంధించారు. వాళ్ల‌పై హత్యాయ‌త్నం, దేశ‌ద్రోహం, పోలీస్ అధికారులు త‌మ విధులు నిర్వ‌హించ‌కుండా అడ్డుకున్న కేసులు వారిపై న‌మోదు చేశారు. వాళ్లంద‌రినీ అరెస్ట్ చేసి వారం రోజుల పోలీస్ రిమాండ్‌కు త‌ర‌లించారు.

గుర్మీత్‌ను పోలీస్ వాహ‌నంలో తీసుకెళ్ల‌కుండా కూడా వాళ్లు అడ్డుకున్నార‌ని, వాహ‌నానికి అడ్డంగా ప‌డుకున్నార‌ని ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన ఓ అధికారి చెప్పారు. గుర్మీత్ ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే