Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జైలులో `ఆమె' కూడా ఉండాలన్న గుర్మీత్‌

Posted 5 months ago | Category : national


అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయదానికి ముందే జైలులో తనతో పాటు తన `కుమార్తె' హనీప్రీత్‌ ఇన్సాన్‌ కూడా ఉండాలని పిటీషన్ వేశారు. "ఇద్దరం ఒకే జైల్లో ఉండాలనుకుంటున్నాం" అని గుర్మీత్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అందుకు సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది.

ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాము మాత్రం కలగజేసుకోమని కోర్టు తేల్చి చెప్పింది. గుర్మీత్‌కి నడుము నొప్పి, మైగ్రేన్‌ ఉందని ఆయనకి తరచూ ఆక్యూప్రెజర్‌ చేస్తుండాలని హనీప్రీత్‌ న్యాయస్థానాన్ని కోరింది. డేరా సామ్రాజ్యంలో గుర్మీత్ తర్వాత ఆమె విశేష అధికారాలు ఉన్న వ్యక్తిగా భావిస్తూ ఉంటారు.

గత వారం సీబీఐ కోర్ట్ కు హాజరైనప్పటి నుండి ఆమె అతని వెంటనే ఉంటున్నారు. ఆమెను తనతో ఉండనీయాలని అంటూ రోహ్‌తక్‌ జైలు అధికారులను గుర్మీత్‌ బెదిరించినట్లు తెలుస్తుంది. హనీప్రీత్‌ని తనతో పాటు జైల్లో ఉండనివ్వకపోతే జైలు అధికారులను సస్పెండ్‌ చేయిస్తానని బెదిరించారట. వివాహిత అయిన హనీప్రీత్‌ని గుర్మీత్‌ 2009లో దత్తత తీసుకున్నారు. ఆమె అసలు పేరు ప్రియాంక తనేజా. ఆమె స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌.

డేరా అనుచరుడు విశ్వాస్‌ గుప్తాను వివాహం చేసుకుంది.అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని హనీప్రీత్‌ గుర్మీత్‌ను ఆశ్రయించడంతో ఆమెను దత్తత తీసుకున్నట్లు చెబుతుంటారు. ఆయన నటించే సినిమాల్లో హనీప్రీత్‌కు అవకాశాలు ఇచ్చేవారు.ఇలా ఉండగా, గుర్మీత్‌ జైలుకు వెళ్లడంతో డెరా సచ్చా సౌధా యజమానిగా  హనీప్రీత్‌ ఇన్సాన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

దర్శకురాలు, ఎడిటర్‌, నటి అయిన హనీప్రీత్‌ కు తాను నటించే సినిమాల్లోనూ  అవకాశాలు ఇచ్చేవారు.  ఇప్పుడు గుర్మీత్‌కి శిక్ష పడడంతో డేరాకు సంబంధించిన వ్యాపారాలన్నింటికీ హనీనే యజమానిగా వ్యవహరించే అవకాశమున్నట్లు డేరా ప్రతినిధులు చెబుతున్నారు. గుర్మీత్ కు ఆమెతో గల సంబంధం తండ్రి, కుమార్తెల సంబంధం కాదని, వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉన్నదని ఆమె మాజీ భర్త ఆరోపించారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి