భారతీయ మహిళ గుల్ పనాగ్ ఫార్ములా వన్ ఈవెంట్ లో పాల్గొన్నది. స్పెయిన్‌లో జరిగిన సర్య్యూట్ లో ఆమె ఫార్ములా ఈ రేసింగ్ కారును డ్రైవ్ చేసింది. ఎం4ఎలక్ట్రో తరహా కారును నడిపిన గుల్ పనాగ్ ఫార్ములా రేసింగ్ ఈవెంట్లో చరిత్ర సృష్టించింది. ఎం4ఎలక్ట్రో కారు మహేంద్ర ఫోర్త్ జనరేషన్‌కు చెందినది. ఈ-రేస్ కారును నడిపిన అతి కొద్ది వ్యక్తుల్లో తాను కావడం సంతోషంగా ఫీలవుతున్నట్లు ఆమె పేర్కొన్నది. గుల్ పనాగ్ హిందీ చిత్రాల్లోనూ నటించింది. నానాపటేకర్ నటించిన అబ్ తక్ చప్పన్ చిత్రంలో గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఆమె ఉంది.