//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీని లవ్ చేశారా..నా డౌట్..!

Category : national

ఒకపక్క కేంద్ర బడ్జెట్ తీరుతో ఆంధ్ర రాష్ట్ర నాయకులూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిరసనలు,నినాదాలు చేస్తున్న పరిష్కరించలేని ప్రధాని మోడీకి,ఇప్పుడు వినూత్న ప్రశ్న వేశారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ.

వాలంటైన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీకి ఓ వింత ప్రశ్న ఎదురైంది.మోడీని ఉద్దేశించి గుజరాత్ MLA జిగ్నేష్ మేవానీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.నాకు చాలా మంది ఐ లవ్ యు చెప్పారు.కానీ మోడీకి ఎప్పుడైనా ఎవరైనా ఐ లవ్ యు చెప్పారా లేదా అన్నది నా డౌట్ అంటూ ట్వీట్ చేసారు.

వాలెంటైన్స్ డే పై తనకున్న అభిప్రాయాన్ని చెప్తూ తనకు నచ్చిన "ఒరు ఆధార్ లవ్" చిత్ర నటి ప్రియా ప్రకాశ్ సాంగ్ తనకు బాగా నచ్చిందని ప్రేమ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మేవానీ ట్వీట్ చేశారు.అంతే కాకుండా మళయాల నటి ప్రియా ప్రకాశ్ వైరల్ సాంగ్‌పైనా ట్వీట్ చేస్తూ ఆ వీడియో క్లిప్ ను ఆరెస్సెస్‌కు లింకు పెట్టారు.ఆరెస్సెస్ నిరసనల కంటే ప్రజలు ఈ సాంగ్‌నే ఎక్కువగా ఇష్టపడ్డారని,దీనిని బట్టి ఇండియన్స్‌కు ద్వేషం కంటే ప్రేమే ఎక్కువని మరోసారి నిరూపితమైందని మేవానీ ట్వీట్ చేశారు.