//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్యని వాటిని అమ్మాల్సిందే అని ఒత్తిడి చేస్తున్న భర్త...

Category : state


అధిక కట్నం తీసుకు రమ్మని భార్యలు ఏడిపించిన భర్తలను చూస్తుంటాం. కాని డబ్బు కోసం అండాలను దానం చేయాలని హింసించిన భర్తను చుసుండం . తాజాగా ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఈ విషయంపై భర్త, అత్తింటివారు తనను బలవంతం చేస్తున్నారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వేజల్ పూర్ ప్రాంతానికి చెందిన ఫర్జానాఖాన్ అనే యువతి 2010 వరకు మస్కట్, ఓమన్ దేశాల్లో నివాసముండి తల్లిదండ్రులతో కలిసి ముంబైకు వచ్చింది. అనంతరం అహ్మదాబాద్ వచ్చిన ఫర్జానా దరియాపూర్ నివాసి అప్జల్ ఖాన్ ను పెళ్లాడింది. భర్త అఫ్జల్ కొన్నాళ్లు ముంబైలో నివాసమున్నా ఉద్యోగం లేక మళ్లీ కుటుంబాన్ని అహ్మదాబాద్ కు మకాం మార్చాడు.

ఏ ఆదాయం లేని అల్లుడి కోసం అత్త అయిన ఫర్జానా అమ్మ ఆటోను కొనిచ్చింది. ఆటో నడిపినా డబ్బు సరిగా రాకపోవడంతో అఫ్జల్ ఖాన్ తన భార్య ఫర్జానాను అజ్మీర్, ఉదయపూర్, వడోదరా నగరాలకు తీసుకువెళ్లాడు. అక్కడి మెటిర్నిటీ హోమ్ లకు భార్య ఫర్జానాను తీసుకువెళ్లి అండాలు దానం చేస్తే డబ్బులు ఇస్తారని భర్త అఫ్జల్ కోరాడు.

ఫర్జానా దానికి నిరాకరించడంతో భర్త అఫ్జల్ ఆమెను కొట్టగా, ఫర్జానా అత్తింటి నుంచి సోదరుడి ఇంటికి వెళ్లింది. ఈ విషయమై ఫర్జానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

Related News