//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వంట తో గిన్నిస్ రికార్డ్

Category : national

గిన్నిస్ బుక్ లో మరో రికార్డ్ చెరిగిపోయింది.

నాగపూర్ కు చెందిన 45 ఏళ్ల విష్ణు మనోహర్ ఏప్రిల్‌ 21న ఉదయం 8గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అంటే 53 గంటలపాటు నిర్విరామంగా వంట చేసి రికార్డు సృష్టించారు. దీనితో ఐస్‌లాండ్‌కి చెందిన బెంజమిన్‌ పెర్రీ పేరిట ఉన్న 40 గంటల గిన్నిస్‌ రికార్డును విష్ణు మనోహర్‌ బద్దలు కొట్టాడు. ఈ రికార్డును బెంజమిన్‌ 2014 మార్చ్ లో సాధించాడు. ఈ రికార్డ్ ను సాధించేందుకు గత రెండేళ్లుగా సిద్ధమవుతున్నానని, లక్ష్యాన్ని అందుకోవడంతో చాలా సంతోషంగా ఉందని విష్ణు తెలిపారు. ఈ రికార్డు కోసం 8 గ్యాస్‌పొయ్యిలను, వంటకాలకు కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసేందుకు 15 మంది సహాయకులను ఉపయోగించుకున్నాడు.