Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

థైరాయిడ్ కు చెక్ పెట్టె జామపండు...

Category : health

మనం రోజు తీసుకొనే పండ్లల లో చాల రకాల విటమిన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని ఎన్నో రకాల రోగాలను నయం చేస్తాయి. వాటిలో జామ పండు ఒకటి. జామపండును రోజు తీసుకోవటం వలన థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామపండు లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే విటమిన్-సి లోపించడం వలన వచ్చే వ్యాధులను జామకాయ తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు అని, అంతేగాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదు అని అంటున్నారు.

జామలో చాలా శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామపండులో విటమిన్-సి తో పాటు విటమిన్-ఏ చాలా ఎక్కువ. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ.. తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.

జామపండులో విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ విటమిన్స్ వలన మెదడులోని న్యూరాన్ల సమర్దవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.