//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీఎస్టీ వచ్చినా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు తప్పవా !

Category : national

ప్రతిష్టాకరమైన జీఎస్టీ ని జులై 1 నుండి అమలులోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆరాట పడుతున్నది. పారిశ్రామిక వర్గాలు సహితం ఎదురు చూస్తున్నాయి.  ఎందుకంటె సరుకుల రవాణాలో రాష్ట్రాల సరిహద్దుల అడ్డంకుల్ని జీఎస్టీ తొలగిస్తుందనే  విశ్వాసమే అందుకు కారణం. అయితే జీఎస్టీ అమలుకు కీలకమైన ఇ - వేబిల్స్ యంత్రాంగం సిద్ధం కాకపోవడమే మరోకొంత కాలం రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు తప్పవని తెలుస్తున్నది.

జీఎస్టీ ముసాయిదా  నిబంధనలు ఇంకా ఖరారు కాకపోవడం, మరో వంక ఇ - వేబిల్స్ కు అవసరమైన వ్యవస్థ సిద్ధం కాకపోవడంతో ప్రస్తుత పర్మిట్ వ్యవస్థ  అనివార్యం అని అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ముసాయిదా నిబంధనలను చర్చించి ఖరారు చేయగలరని భావిస్తున్నారు. 

ఇ - వేబిల్స్ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఇంతవరకు ప్రభుత్వం సమకూర్చలేదు. రాష్ట్రాల లోపల, రాష్ట్రాల మధ్య రూ 50 వేలకు విలువ మించిన వస్తువుల రవాణా సమయంలో వారు పన్ను చెల్లించారా, లేదా అని ఎక్కడైనా తనిఖీ చేయడమా కోసం జీఎస్టీ లో  ఇ - వేబిల్స్ విధానాన్ని ప్రతిపాదించారు.  

ఇ - వేబిల్స్ కు కొత్త నిబంధనలు అమలులోకి రావడానికి డిసెంబర్ వరకు పట్టవచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకు ప్రస్తుతం  అంతర్ రాష్ట్ర సరుకుల రవాణాకు అమలులో ఉన్న పర్మిట్ విధానాన్నే అనుసరించ వలస ఉంటుంది. అందుకనే ఇ - వేబిల్స్ అమలులోకి వచ్చే వరకు జీఎస్టీ అమలులోకి వచ్చినా ప్రస్తుతం రాష్ట్రాల  సరిహద్దులలో ఉన్న చెక్ పోస్ట్ లు, అంతర్ రాష్ట్ర పర్మిట్ లు, ట్రాన్సిస్ట పర్మిట్ లు కొనసాగక తప్పదు. 

ముసాయిదా ఇ - వేబిల్స్ నిబంధనల ప్రకారం రూ 50 వేలకు మించి విలువ గల సరుకుల రవాణా చేయగోరె వారంతా జిఎస్టియిన్ పోర్టల్ లో ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ విధంగా నమోదు చేసుకోవడానికి వార్షిక లావాదేవీలు రూ 20 లక్షల వరకు ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలలో అయితే రూ 10 లక్షల వరకు సరిపోతుంది.

 ముసాయిదా నిబంధనలు ఖరారు అయిన తరువాత ముందుగా ఈ మొత్తం వ్యవహారం నిర్వహించడం కోసం ప్రభుత్వం ఒక ఐటి భాగస్వామిని ఎంచుకో వలసి ఉంటుంది. మరోవంక ప్రభుత్వం గతనెల ప్రకటించిన ముసాయిదా నిబంధనల పట్ల పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, పరోక్ష పన్నుల విధానంలో నెలకొన్న విధంగా సరుకులు సులభంగా రవాణాకు పలు అడ్డంకులు ఏర్పడే విధంగా ఉన్నాయని పేర్కొంటున్నాయి.