//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైద్య, విద్య రంగాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు

Category : national

జీఎస్‌టీ పరిథి నుంచి  కీలక మైన ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలకు మినహాయింపు ఇవ్వాలని జమ్మూలో ముగిసిన రెండు రోజుల జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశాలలో నిర్ణయించారు. అయితే బంగారంపై పన్ను గురించి మాత్రమే ఒక నిర్ణయానికి రాలేక పోయారు. జూన్ 3న జరిగే సమావేశంలో ఈ విషయమై నిర్ణయించనున్నారు. 

టెలికాం, బీమా, హోటళ్ళు, రెస్టారెంట్లు సహా సేవా రంగానికి వర్తించే పన్ను రేట్లపై తుది నిర్ణయం తీసుకున్నారు. వస్తువులకు నిర్ణయించినట్లు గానే వస్తు సేవలకు కూడా నాలుగు రకాలుగా స్లాబ్ లను 5, 12, 18, 28 శాతం చొప్పున ఖరారు చేశారు. టెలికాం, ఆర్థిక సేవలకు 18 శాతం రవాణా సేవలకు 5 శాతం, రవాణా సేవలకు 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. 

కొత్త విధానం ప్రకారం రైలు, విమాన, రోడ్డు రవాణా సేవలపై 5 శాతం పన్ను విధిస్తారు. నాన్ ఏసీ రెస్టారెంట్ల సేవలపై 12 శాతం పన్ను వసూలు చేస్తారు. ఏసీ రెస్టారెంట్లు 18 శాతం పన్ను పరిథిలోకి వచ్చాయి. రూ.2,500 నుంచి రూ.5 వేల మధ్య టారిఫ్‌గల హోటళ్ళు కూడా 18 శాతం పన్ను పరిథిలోకి వచ్చాయి. రూ.5 వేల పైన టారిఫ్ ఉన్న హోటళ్ళు 28 శాతం పన్ను పరిథిలోకి వచ్చాయి. అయితే రూ.1,000 కన్నా తక్కువ టారిఫ్‌గల హోటళ్ళను జీఎస్‌టీ నుంచి మినహాయించారు. లగ్జరీ సర్వీసులపై 28 శాతం పన్ను విధిస్తారు.

కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్ల వల్ల ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం పడదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత పన్ను కన్నా కొత్త పన్ను ఎక్కువగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఉత్పత్తుల మూలాలపై పన్నుతో సర్దుబాటు చేసినపుడు పన్ను రేటు చాలా తగ్గుతుందని తెలిపారు.