ఢిల్లీలో ఆదివారం జరిగిన జీఎస్టీ సమావేశంలో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. 133 విన్నపాలను పరిశీలించిన జీఎస్టీ కమిటీ..66 వస్తువుల రేట్లను తగ్గించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వినోదపు పన్ను దేశంలో 20 నుంచి 110 శాతం వరకు వసూలు చేస్తున్నారని.. ఇపుడు రెండే రెండు పన్ను రేట్లు పెట్టామన్నారు. రూ. 100 కంటే టికెట్ ఎక్కువ ఉంటే జీఎస్టీ 28శాతమని.. టికెట్ రేట్ వంద కంటే తక్కువ ఉంటే జీఎస్టీ 18శాతం పన్ను వేస్తామన్నారు. ఇళ్లలో తయారుచేసే బట్టలు, నగల మీద పన్నును 18 నుంచి 5 శాతానికి తగ్గించామన్నారు.