//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

177 వస్తువులపై పన్ను తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్‌ : వస్తువులివే

Category : national

ఈ రోజు గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది.

ఈ సమావేశంలో వస్తు సేవల పన్ను పరిధిలోని 28 శాతం శ్లాబులో ఉన్న మరో 177 వస్తువులను దాన్ని నుంచి తప్పించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరణలను చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో చాక్లెట్లు, చూయింగ్‌ గమ్‌లు, షాంపూలు, డియోడ్రెంట్‌లు, షూ పాలిష్‌, డిటర్జెంట్‌, పోషకాహార పానీయాలు, సౌందర్య సాధనాలు లాంటి ధరలు తగ్గనున్నాయి. ‘ఇప్పటివరకు 28 శ్లాబు పరిధిలో 227 వస్తువులు ఉండేవి... తాజాగా 177 ను ఈ పరిధి నుంచి తప్పించడంతో కేవలం 50 వస్తువులు మాత్రమే ఉన్నాయని... ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులను తొలగించిందని బిహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొన్న‌ బీహార్‌ ఆర్థికశాఖ మంత్రి సుశీల్‌ మోదీ తెలిపిన వివ‌రాల మేర‌కు..

ఇక‌పై 50 వస్తువులు మాత్రమే 28 శాతం శ్లాబులో

ఇప్ప‌టివరకు 227 వస్తువులు 28 శాతం శ్లాబులో

62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫారసు

అంతకంటే ఎక్కువ వస్తువులను (177) 28 శాతం శ్లాబు నుంచి తొలగించిన జీఎస్టీ కౌన్సిల్‌

28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి రానున్న చాలా వ‌స్తువులు

పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు మాత్రం 28 శాతం శ్లాబులోనే

దీంతో చాలా వస్తువులు 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయి. తదనుగుణంగానే ధరలు కూడా తగ్గుతాయని ఆయన వెల్డించారు.

Related News