//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

GST ఐదు ముసాయిదా చట్టాలకు కౌన్సల్ ఆమోదం

Category : business politics

గురువారం జరిగిన GST కౌన్సిల్ కీలక సమావేశంలో రాష్ట్రాల GST,కేంద్ర పాలితప్రాంతాల GST ముసాయిదా చట్టాలను కౌన్సిల్ ఆమోదించింది.దింతో GST కి సంబదించిన ఐదు కీలకమైన బిల్లులకు కౌన్సిల్ ఆమోదం లభించింది.ఇక వీటికి కేబినెట్ ఆమోదం పొందవలిసి ఉంటుంది.అనంతరం ఈ ఐదు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడతారు.రాష్ట్రాల GST ముసాయిదా బిల్లుకు ఢిల్లీ,పుదిచ్చేరి,అసెంబ్లీలు కూడా ఆమోదిస్తే ఇక అడ్డుంకులేమి వుండవు.GST లో భాగంగా నిర్దేశించిన తొమ్మిది సెట్ల నియమనిబంధనలలో ఐదు సెట్లను గురువారం కౌన్సిల్ ఆమోదించింది మిగిలిన నాలుగు సెట్ల నియమ నిబంధనలు మార్చి 31 న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం వుంది.తర్వాత ఈ శ్లాబులో ఏ కమోడిటీ సర్వీసును చేస్తారన్న విషయమై కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోనుంది.ఆ నాలుగు శ్లాబులు 5, 12,15, 28 శాతం పన్ను రెట్లున్నది విదితమే.ప్రస్తుతం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఊపుచూస్తుంటే అనుకున్న ప్రకారం జులై 1 కి GST అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్దమైనట్లే కనిపిస్తుంది.