ఇంకొన్ని రోజుల్లో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమల్లోకి రాబోతోంది..దీంతో అప్పుడు ఎక్కువ పన్ను బడి...రేట్లెక్కువయ్యే వస్తువులపై పేటిఎం సూపర్ ఆఫర్లంటూ ఊదరగొడుతోంది..పాత వస్తువులన్నింటిన్నీ అమ్మేసేయాలని ఇటు షాపులోళ్లు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జూన్ 15 వరకూ ప్రీ-జీఎస్టీ క్లియరెన్స్ సేల్ ను నిర్వహించనుంది. ఐతే ఇక్కడే కిటుకుంది..అసలు జీఎస్టీ జులై 1 నుంచైతే ఎవుడైనా..జూన్ 29దాకా కనీసం ఆఫర్లిస్తారు..మరీళ్లేందోకానీ రెండ్రోజులే పెడుతున్నారు..అంటే ఈ జిఎస్టీ పేరు సెప్పుకుని పాత వస్తువుల రేట్లు పెంచుతారనన్నమాట..ఆ పెంచినవాటిపైనే క్యాష్ బ్యాక్ ఆఫర్లు..ఇచ్చి మనకి బొక్క ఎట్టే ఆలోచన బానే ఉంది..ఐతే మరి జనమేనా పిచ్చోళ్లు..ఆ మాత్రం రేట్లు పోల్చుకోకుండానే కొంటారా..అందుకే బాబులూ మిగిలిన సైట్లు..అట్టానే సందుసివర షాపుల్లోనూ అన్నీ ఎంకైరీలు సేసి మరీ కొనండి..అంతేగానీ..ఆడెవుడో ఆపరనగానే ఎగేసుకుని డబ్బులు ఎదజల్లమాకండి..