//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శ్రద్ధ .. మహిళల్లో ఈ మార్పు అవసరం

Category : editorial

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గతంతో పోలిస్తే మహిళలు ఇప్పుడు చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహార అలవాట్లు కూడా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగినులైనా, గృహిణులైనా ఏదిపడితే అది తినడానికి ఇష్టపడడం లేదు. ఆరోగ్యం పట్ల ఇటీవల మహిళల్లో శ్రద్ధ బాగా పెరిగిందని ఓ సర్వేలో తేలింది.

అందుకే మహిళలు అడ్డమైన చిరుతిళ్లు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధతో హెల్దీ స్నాక్స్‌కే ఓటేస్తున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా తృణధాన్యాలను, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. బరువు పెరగకుండా ఉండేలా, ఆరోగ్యాన్నిచ్చే హెల్తీ స్నాక్స్ మాత్రమే తింటున్నారు. ఆరోగ్యాన్ని అందించే ఆల్మాండ్స్, తాజా పళ్లను మాత్రమే స్నాక్స్‌గా తీసుకునేందుకు ఎక్కువమంది మహిళలు మక్కువ చూపుతున్నారని సర్వే వెల్లడించింది.

’’ఆరోగ్యకరమైన లైఫ్‌ స్టయిల్‌ ఎప్పటికైనా మేలే చేస్తుంది . ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది’’ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. సర్వేలో చాలామంది మహిళలు ఆల్మాండ్స్‌ను తమ హ్యాండ్‌బ్యాగుల్లో తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. బయటి ఫుడ్‌ కాకుండా, ఇంట్లో చేసుకున్నవాటినే స్నాక్స్‌గా తీసుకునేందుకు ఇష్టపడుతుండటం గొప్ప పరిణామంగా న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇంకా మహిళలలో తమ ఆరోగ్యంపట్ల, తమ సౌందర్యం పట్ల శ్రద్ధ రావాల్సి ఉంది. ఆరోగ్యం పట్ల కాస్తయినా శ్రద్ధ చూపిస్తూ మహిళల్లో వస్తున్న ఈ మార్పు పరిగణలోకి తీసుకోవాల్సిన మార్పు అని చాలామంది భావిస్తున్నారు.