Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెద్ద నోట్లను రద్దు పాతాళంలోకి పడిపోయిన వృద్ధి

Posted 5 months ago | Category : national

పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో వృద్ధి పాతాళంలోకి పడిపోయిందని వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థిక వేత్త కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను వృద్ధి మూడేండ్ల కనిష్ఠ స్థాయి 5.7 శాతానికి జారుకోవడం ఆందోళన కల్గిస్తున్నదన్నారు.

"నేను అంచనావేసిన దానికంటే తక్కువగా వృద్ధి నమోదైంది" అని చెప్పారు. 2003 నుంచి 2011 మధ్యకాలంలో భారత వృద్ధి 8 శాతం కంటే అధిక స్థాయిలో కొనసాగిందన్న విషయాన్ని బసు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ జీడీపీ 6.8 శాతంగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గడం, ప్రస్తుతానికి ఇండియా స్థానాన్ని చైనా దక్కించుకున్నప్పటికీ భవిష్యత్తులో 8 శాతం దాటే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా తప్పిదమని, ఎగుమతులు, ఇతర రంగాలపై తీవ్రస్థాయిలోప్రభావం చూపిందని బసు పేర్కొన్నారు. వస్తు, సేవా పన్ను, దివాలా చట్టం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తు వృద్ధి ఆధారపడివుంటుందని పేర్కొన్నారు.

సంపన్న దేశాల్లో ఒకటైన భారత్‌లో సగం మందికి బ్యాంక్ ఖాతా లేదని, ఈ సమయంలో డిజిటల్ పరిధిలోకి రావడం విడ్డురంగా ఉందని చెప్పారు. నిరుపేదలకు వ్యతిరేకంగా పాలసీలను రూపొందిస్తున్నారని, ఇది వారికి చెడు చేయనున్నదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచాలని, అప్పుడే డిమాండ్ పెరిగి మెరుగైన వృద్ధికి బాటలు వేయనున్నదని చెప్పారు. డాలర్‌తోపోలిస్తే రూపాయి బలపడుతుండటం దేశీయ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చనున్నప్పటికీ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం చూపనున్నదని తెలిపారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే