ఇన్సూరెన్స్ బ్రోకింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి నూరుశాతం విదేశీ పెట్టుబడులను కేంద్రప్రభుత్వం అనుమతించనున్నది. ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడులకే ఇన్సూరెన్స్ రంగంలో ప్రభుత్వం అనుమతి ఉంది. డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిర్వచనం ప్రకారం ఇన్సూరెన్స్ బ్రోకింగ్,ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర కంపెనీల అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, నష్ట పరిహారం లెక్కించేవారు అందరూ ఇన్సూరెన్స్ రంగంలో లెక్కింపబడతారు.ఇన్సూరెన్స్ బ్రోకర్లను కూడా ఇతర బ్రోకరేజీ సంస్థలలానే ప్రభుత్వం పరిగణించాలని ఇన్సూరెన్స్ బ్రోకర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ప్రత్యేక్ష విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తే కొత్త టెక్నాలజీని ఉపయోగించి పెద్ద ఎత్తున ఈ రంగాన్ని విస్తరింపజేసే కంపెనీలు రంగంలోకి దిగుతాయని ఒక ఇన్సూరెన్స్ బ్రోకర్ అభిప్రాయపడ్డారు.