//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి

Category : national

దేశ రక్షణలో భాగంగా అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. మూడు రోజుల సిక్కిం పర్యటనలో భాగంగా శనివారం రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌-చైనా అంతర్జాతీయ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న జవాన్లను కలిశారు. అక్కడి సమస్యల గురించి, భద్రత గురించి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు భద్రతపై జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో సమావేశమై చర్చించారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగిన సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్‌ జవాన్ల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్‌ యాప్‌ గురించి ఆయన మాట్లాడారు. జవాన్ల సమస్యలు తెలుసుకోని వాటిని పరిష్కరించడం మన బాధ్యత, అందుకే యాప్‌ను తీసుకొచ్చినట్లు రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. మొబైల్‌ యాప్‌ ఎలా ఉపయోగపడుతుందనే దాని గురించి ఐటీబీపీ జవాన్లను అడిగి తెలుసుకున్నారు.