//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లెక్చరర్లకు బంపర్‌ బొనాంజా ప్రకటించిన కేంద్రం

Category : national

కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు బంపర్‌ బొనాంజా తగిలింది. సుమారు 8 లక్షల మంది అధ్యాపకులకు 22 నుంచి 28 శాతం వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 7వ వేతన సవరణ సంఘం సిపార్సులను ఆమోదించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ ప్రకటించారు. 7వ వేతన సవరణ సంఘం ఇచ్చిన సిఫార్సులపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పే కమిషన్‌ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులకు, యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ పరిధిలో ఉన్న వర్సిటీలు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాంకేతిక, ఇతర ఉన్న విద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఆయన చెప్పారు.