//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సల్మాన్ ఖాన్ ని కొడితే 2 లక్షలు

Category : national movies

బాలివుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ని కొడితే 2 లక్షలు ఇస్తానని ప్రవీణ్ తొగాడియా అనుచరుడు కీలక ప్రకటన చేసాడు. నవరాత్రి పండుగ సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ‘లవరాత్రి’ పేరిట సినిమా తీశాడని విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొత్తసంస్థ ‘హిందూ హై ఆజ్’ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఆరోపించారు. లవరాత్రి సినిమాను సెన్సార్ బోర్డు అడ్డుకోవాలని,

ఒకవేళ దానికి అనుమతిస్తే హిందూ కార్యకర్తలతో కలిసి సినిమాహాళ్లను దహనం చేస్తామని గోవింద్ హెచ్చరించారు. బహిరంగంగా సల్మాన్ ఖాన్ ను కొట్టిన వారికి రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తానని గోవింద్ పరాషర్ ప్రకటించారు. లక్షలాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సల్మాన్ నిర్మించిన లవరాత్రి సినిమాను నిషేధించాలని గోవింద్ డిమాండ్ చేశారు. ఆగ్రా నగరంలోని భగవాన్ టాకీస్ లో లవరాత్రి సినిమాకు చెందిన సల్మాన్ ఖాన్ పోస్టర్లను గోవింద్ పరాషర్ హిందూ హై ఆజ్ కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది.