//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

Category : politics

తెలంగాణ రాష్ట్రము లో 2018-19 బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయం లో , ముందుగా చెప్పినట్టుగానే కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ నేతలు ప్లకార్డ్స్ తో తమ నిరసనలు తెలిపారు. నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. గవర్నర్ రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారుతుందని చెప్పారు. రాష్ట్రం లో నిరంతరం కరెంటు ను కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఈ ప్రభుత్వం చేప్పట్టిన కార్యక్రమాలన్నీ చాలా బాగా ముందుకు సాగుతున్నాయి అని గవర్నర్ చెప్పారు. అప్పటివరకు తమ స్థానాల్లోనే కూర్చుని నినాదాలు చేసిన కాంగ్రెస్ సభ్యులు, ఒక్కసారిగా పోడియాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నం చేసారు. దీనితో అక్కడున్న మార్షల్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. వారితో జీవన్ రెడ్డి గొడవకుదిగారు. దీనితో సభలో గందరగోళం నెలకొన్నది.